శ్రీ స్వామి వారి భక్తులకు ప్రతి సంవత్సరం నిరాటంకంగా అన్నదానం చేయాలనే సత్సంకల్పంతో “శాశ్వత అన్నదాన పథకము” అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము.
· భక్తులు ఈ శాశ్వత అన్నదాన పథకానికి తమ శక్తి కొలది విరాళాలు ఇచ్చి ఈ సత్కార్యాన్ని ప్రోత్సాహించవలసిందిగా కోరుతున్నాము.
· రూ. 1,116/- అంతకంటే ఎక్కువగా ఇచ్చిన విరాళాలను బ్యాంకునందు డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో ప్రతీ సంవత్సరం మకరజ్యోతి పండగనాడు సన్నిధానము నందు దాత యొక్క గోత్రనామములతో ఇద్దరు స్వాములకు ఒక పూట భిక్ష ఏర్పాటు చేయబడును.
· ఈ పథకం క్రింద రూ.1,116/- అంతకంటే ఎక్కువ విరాళమిచ్చిన వారికి ఒక సర్టిఫికెట్ ఇవ్వబడును. దాతలు ఈ పథకానికి తమ విరాళాలను నగదు రూపంలో ఇవ్వవచ్చు. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు “శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి, కాకినాడ” పేరు మీద తీసుకోవాలి.
విరాళాలు
భక్తులు తమ శక్తి కొలది విరాళాలు ఇచ్చి ఈ సత్కార్యాన్ని ప్రోత్సాహించవలసిందిగా కోరుతున్నాము.
· రూ. 20,000/- లేదా అంతకంటే ఎక్కువ విరాళమిచ్చిన దాతలను మహారాజ పోషకులుగా పరిగణించి, వారి తరపున ప్రతి సంవత్సరం 100 మంది స్వాములకు శబరిమలలో అన్నదానం చేస్తాము.
· రూ. 10,000/- లేదా అంతకంటే ఎక్కువ విరాళమిచ్చిన దాతలను రాజ పోషకులుగా పరిగణించి, వారి తరపున ప్రతి సంవత్సరం 50 మంది స్వాములకు శబరిమలలో అన్నదానం చేస్తాము.
· రూ. 5,000/- లేదా అంతకంటే ఎక్కువ విరాళమిచ్చిన దాతలను పోషకులుగా పరిగణించి, వారి తరపున ప్రతి సంవత్సరం 25 మంది స్వాములకు శబరిమలలో అన్నదానం చేస్తాము.
దాతలు తమ విరాళాలను నగదు రూపంలో ఇవ్వవచ్చు. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు “శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి, కాకినాడ” పేరు మీద తీసుకోవాలి. లేదా దాతలు నేరుగా మా ఆంధ్రా బ్యాంకు, రామారావు పేట శాఖ ఖాతానందుగాని (ఖాతా సంఖ్య 231268), భారతీయ స్టేట్ బ్యాంకు- శ్రీరాంనగర్ శాఖ ఖాతానందు గాని (ఖాతా సంఖ్య 10357893946) విరాళాలను జమ చేసి రసీదును పొందవచ్చు.
భక్తులిచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను చట్టం 1951 సెక్షన్ 80జి ప్రకారం మినహాయింపు లభిస్తుంది.