1.మా గురించి

 

మాల ధరించి మండలం రోజులు అకుంఠిత దీక్షతో కఠినమైన నియమనిష్టలను పాటించి ఇరుముడితో సన్నిధానానికి వచ్చే స్వాముల కోరికలను నెరవేర్చడానికి పట్టబంధం కట్టుకుని తపోనిష్టతో ఉన్న కలియుగ దైవం శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి.

ఈ రోజున భారతదేశం నందలి అన్ని ప్రాంతాల నుండియే కాక విదేశాల నుంచి సైతం కోటానుకోట్ల మంది భక్తులు ప్రతి సంవత్సరం జనవరి 14 తేదీన శబరిమలలో వేంచేసియున్న శ్రీ అయ్యప్ప స్వామివారి దర్శనానికి, వారి దివ్య మకరజ్యోతి దర్శనానికి పెద్దపాదం ద్వారా, చిన్నపాదం ద్వారా వచ్చుచున్నారు. కాని శబరిమలలో ఉన్న వసతి సదుపాయాలు భక్తులకు సరిపోవడం లేదు. చాలా మంది భక్తులు ఏ సదుపాయము లేక స్వామి వారి సన్నిధిలో గడపడం కష్టముగా భావించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందలేక పోతున్నారు. ఈ పరిస్థితిని కొంతవరకైనా నిరోధించవలెనన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన సంస్థ ‘శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి’

 

గత కొన్ని సంవత్సరాలుగా మా కార్యవర్గ సభ్యులు, ఇతర స్వాములతో కలసి శ్రీ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, అక్కడ భక్తులు పడుతున్న అవస్థలు గమనించాము. శబరిమల యాత్రికులకు మా వంతుగా సహాయ పడాలనే సదుద్దేశ్యంతో, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించవలెననే ఆశయంతో ఈ సంస్థని 2002 లో స్థాపించి శ్రీ స్వామి వారి భక్తులకు మా శక్తి కొలది అన్నదానం చేయుచున్నాం.
(మేము ప్రతీ ఏడాది జనవరి 11నుంచి 14 వరకు సన్నిధానంలో అన్నదానం చేస్తాము. సరుకులు, పాత్రలు,  వంటవాళ్ళని ప్రతీ ఏడాది శబరిమల తీసుకువెడతాము) వీలున్నప్పుడల్లా వైద్య సేవలు కూడా అందించే ఏర్పాటు చేసాము.
 గత కొన్నేళ్ళుగా మేము కాకినాడలో అయ్యప్ప పీఠం ఏర్పాటు చేసి, విశేష పూజలు జరిపిస్తున్నాము. కార్తీక మాసంలో లక్ష కుంకుమార్చన చేసి కనీసం వెయ్యినుంచి రెండు వేల మంది స్వాములకు అన్నదానం చేయుచున్నాము. మా సంస్థ కార్యకలాపాలపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తని ఇక్కడ చదవండి.

మా ఈ ప్రయత్నం సఫలీకృతం కావడానికి మీ సంపూర్ణ సహకారాన్ని అర్ధిస్తున్నాము.